Tuesday, March 17, 2026

లక్ష డప్పులు, వెయ్యి గొంతులు కరపత్ర ఆవిష్కరణ

  • కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మార్పిస్ నాయకులు

నేటిసాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం ఎమ్మార్పిస్ మండల అధ్యక్షులు బండారి నరేష్, ప్రధాన కార్యదర్శులు దుబ్బాక అరుణ్, మండల ఉపాధ్యక్షులు ఈదురు మహేష్, మండల జేఏసీ అధ్యక్షులు పరపెల్లి ప్రసాద్, సురుగు శ్రీనివాస్, ఆధ్వర్యంలో పద్మశ్రీ మంధకృష్ణ మాదిగ అన్నగారి పిలుపు మేరకు హైదరాబాద్ ఎల్ బి స్టేడియం నుండి అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే లక్ష డప్పులు వెయ్యి గొంతులు మాదిగల మహా భారీ సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా చంకన డప్పు వేసుకుని హైదరాబాద్ నడి ఒడ్డున జరిగే ర్యాలీ విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దోమకొండ నరసయ్య, కోలపురి రమేష్, పర్రపెల్లి ప్రభుదాస్, కొత్తూరి స్వామి, పర్రపల్లి ఆనందం, రామంచ లక్ష్మణ్, నేరెళ్ల మహేష్, తాండల భూమయ్య, పెంట రాములు, శంకు రాజు, కొండయ్య అంజయ్య, మల్లయ్య కిరణ్, సంతోష్, వీరయ్య, జిల్లాల వంశీ, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News