Tuesday, March 17, 2026

అర్హులైన నిరుపేదలకు కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి పంచండి..!

  • చందుర్తి తహసీల్దార్ కు ప్రజావాణిలో వినతి

నేటి సాక్షి ప్రతినిధి, చందుర్తి ( సతీష్ ) : జాతీయ బీసీ సంక్షేమ సంఘం చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి, భూమి లేని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ భూమి ఇవ్వాలని చందుర్తి తహసీల్దార్ కు ప్రజావాణిలో వినతి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం చందుర్తి మండల అధ్యక్షులు అమరబండ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మ్యాకల పరుశురాం, జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ చేతుల మీదుగా చందుర్తి తహసిల్దార్ కు ధరణి అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు జిల్లాలోని కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి, ఒక కమిటీ వేసి ప్రజా అవసరాలకు ఉపయోగపడేలా, అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ధరణి అమలులోకి వచ్చినప్పటి నుండి అనగా 2020 నుండి 2025 వరకు జిల్లాలోని ప్రతి గ్రామాలలో ఉన్న కొందరు రాజకీయ నాయకులు, సంపన్నులు, మరికొందరు వ్యక్తులు, ఇతరులు,వారి స్వాలాభం కోసం, ప్రభుత్వ భూములు అనగా అసైన్డ్ భూములు, లావని భూములు, పోరంబోకు భూములు, స్వాతంత్ర్య సమరయోధుల భూములు, బంజరు భూములు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, నిరుపయోగం ఉన్న భూములు, ప్రభుత్వానికి సంబంధించిన ఇతరత్ర భూములను నిరుపేదలకు పంచాలని కోరారు. ప్రభుత్వ భూములను కబ్జాలు గురైనవి కావున, ఈ ప్రభుత్వ భూములను గుర్తించటానికి జిల్లాస్థాయిలో ఒక కమిటీ వేసి, కబ్జాలకు గురియినా ప్రభుత్వం భూములపై విచారణ జరిపిపించి వెంటనే ఆ ప్రభుత్వం భూములను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వం భూములు కబ్జాలకు కాకుండా చూడాలని, ఈ ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలకు, ప్రజా అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో చందుర్తి మండలం ప్రధాన కార్యదర్శి అనపర్తి సతీష్, ఉపాధ్యక్షులు హనుమయ్య చారి, మండల ముఖ్య సలహాదారు తిప్పని నరసయ్య, సీనియర్ బీసీ నాయకులు చిలుక పెంటయ్య, మండల అధికార ప్రతినిధి మట్కామ్ మల్లేశం, మండల కోశాధికారి తిప్పని శ్రీనివాస్,సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిగుర్ల మల్లేశం,మండల కార్యదర్శి బొరుగాయ ప్రసాద్,రామన్నపేట గ్రామ అధ్యక్షుడు బాషోజీ వేణు,గడ్డం పెద్దరాజు, తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News