Tuesday, March 17, 2026

కేరళ మోడల్ స్కూల్స్ వసంత పంచమి వేడుకలు..!

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ) ; వేములవాడ పట్టణంలోని సాయి నగర్, ఉపగడ్డ వీధిలో గల కేరళ మోడల్ స్కూల్స్ లో వసంత పంచమి పర్వదినం వేడుకలను వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సతీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ…
విద్యార్థులకు విద్య బుద్ధిని ప్రసాదించే సరస్వతి దేవి పుట్టినరోజు అయినటువంటి వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేసి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకు బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News