- ఇప్పటికైనా ప్రభుత్వం దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
- నాలుగు నుండి ఆరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలి.
- ఆల్ బీసీ మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అంకుష్ డిమాండ్
నేటి సాక్షి, జమ్మికుంట : తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన కుల బీసీ కుల గణన సర్వే ఫలితాలను నిన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారిక లెక్కలను వెల్లడించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలు ఉంటే అందులో 10.08 శాతం బీసీ ముస్లింలు ఉన్నారని అధికారిక లెక్కలు చెప్పడం జరుగుతుంది. దీని ఆధారంగా జమ్మికుంట కొత్తపల్లిలో ఆల్ బీసీ మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అంకుష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మహమ్మద్ అంకూస్ మాట్లాడుతూ బీసీ దూదేకులమైన మేము రాష్ట్రంలో 10% ఉన్నామని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కడు దారిద్రంలో బ్యాండ్ మేళాలు వాయిస్తూ, పరుపులు కుడుతూ, పాత ఇనుప సామాన్ పనులు చేస్తూ, చికెన్ సెంటర్లు నిర్వహిస్తూ చాలీచాలని బ్రతుకులతో బ్రతుకుతున్నటువంటి దూదేకుల కులస్తులు. పేరుకే ముస్లింలు కానీ ఇప్పటివరకు ముస్లిం కార్పొరేషన్ ద్వారా వీరికి ఎటువంటి లబ్ధి జరగలేదని ఎవరైతే ఫార్వర్డ్ ముస్లింలుగా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించిన 2.48 శాతం ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రమే కార్పొరేషన్ సౌకర్యాలు అందుతున్నాయని జనాభా పరంగా మాత్రమే 10% దూదేకుల వారు కౌంటుకు వస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మాత్రము వెనుకబడి పోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే ద్వారా ఇప్పటికీ మా బలం మా బలగం ఎంతో తెలిసిపోయిందని, దీనినే ప్రభుత్వాలు గుర్తించి దృష్టిలో పెట్టుకొని దూదేకుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీరిని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందేరకంగా ప్రయత్నం చేయాలని లేనియెడల ప్రభుత్వాలకు మా 10% బిసి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారికి భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో బీసీ ముస్లిం నాయకులు మహమ్మద్ రియాజ్, మహమ్మద్ ఇలియాజ్, మహమ్మద్ మహమూద్, మహమ్మద్ ఖాదర్ లు పాల్గొన్నారు.





