Tuesday, March 17, 2026

మోదీ దిష్టి బొమ్మ దహనం

నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్ టి.ఎన్ రమేష్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందిఅని, బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో భాగంగా నే ఆ రాష్ట్రాల వాళ్లకు, అనుకూలంగా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తెలంగాణ నుండి జీఎస్టీ మరియు టాక్స్ ల ద్వారా కోట్ల రూపాయలు కేంద్రా ప్రభుత్వానికి వెల్లుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు మొండిచేయి చూపించింది. అని కామారెడ్డి జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు. తెలంగాణలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు కేటాయించకపోతే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన సోమవారంరోజు ఇందిరాగాంధీ కూడలిలో, మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, షేరు ,రాజా గౌడ్, మైనార్టీ సెల్ సిరాజుద్దీన్, బీసీ సెల్ పుట్నాల శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు జొన్నల నర్సింలు, రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లక్ష్మీరాజం, దోమకొండ శ్రీనివాస్, జ్యోతి రెడ్డి, పంపరి లక్ష్మణ్, శెట్టి భాస్కర్, సర్వర్, జాకీర్, అజీజ్ పెన్సిల్వా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News