Tuesday, March 17, 2026

చట్టపరమైన అంశాలపై అవగాహన సదస్సు

  • తిరుపతి జిల్లా సహకార శాఖాధికారి లక్ష్మి

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చట్టపరమైన అంశాలపై అవగాహన పెంచుకుని సహకార సంఘాలు సక్రమంగా నిర్వహించే చూడాలని తిరుపతి జిల్లా సహకార శాఖాధికారి లక్ష్మి సహకార సంఘాల సిబ్బందికి సూచనలు చేశారు జిల్లాలోని సహకార అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు సీనియర్ ఇన్స్పెక్టర్ లకు చట్టపరమైన అంశాలపై అవగాహన సదస్సు తిరుపతి లోని యూత్ హాస్టల్ లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సహకార శాఖాధికారి లక్ష్మి సహకార సంఘాలాల్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తెలిసినప్పుడు చేపట్టాల్సిన సెక్షన్ 51 విచారణ.. సెక్షన్ 52 దర్యాప్తు అంశమైన సెక్షన్ 60 సత్యార్థుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమాచారం వివరంగా ఆమె చెప్పారు. అదేవిధంగా జిల్లాలో పిఎసిఎస్ లో కంప్యూటరీకరణ శరవేగంగా జరుగుతోందని తెలిపారు సంఘ సభ్యులకు మరింత చేరువ కావాలని ఆడిట్, ఇన్స్పెక్షన్ తదితర కార్యక్రమాలు మరింత నైపుణ్యాలతో నిర్వహించాలని సూచించారు. సహకార సంఘాల చట్టంలోని నిబంధనలు పలు రకాల అంశాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయినాథ, డిప్యూటీ రిజిస్ట్రార్, ప్రొద్దుటూరు శిక్షణ కేంద్రం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ నాగభూషణం మాట్లాడుతూ కామన్ అకౌంటింగ్ సిస్టం లో సంఘాల నిర్వహణ గురించి అనుసరించాల్సిన పద్ధతులు నిర్వహించవలసిన రిజిస్ట్రర్ వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, గూడూరు డివిజన్ పరిధిలోని సహకార సంఘాల శాఖా సిబ్బంది, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News