Tuesday, March 17, 2026

20 ఏళ్ళుగా మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు

  • ఓట్ల కోసమే ఇండ్ల చుట్టూ పనులు మాత్రం శూన్యం
  • డ్రైనేజీలు, సిసి రోడ్ల పనులు చేపట్టండి
  • ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బుద్ధారంలోని కాలనీ ప్రజలు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా ఫిబ్రవరి 03 : గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామంలోని బలరాంరెడ్డి కాలనీకి చెందిన ప్రజలు సోమవారం వనపర్తి జిల్లా కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ ఆదర్శ సురభిని కలసి ఫిర్యాదు చేయడం జరిగింది. 20 సంవత్సరాలుగా బుద్ధారం గ్రామంలోని కాలనీలో ఇండ్లు కట్టుకొని దాదాపుగా 150 మంది జనాభా నివసిస్తున్నామని, ప్రభుత్వానికి ప్రతి ఇంటి నుండి ట్యాక్సీలు కట్టుకుంటున్నామని కనీసం త్రాగటానికి మంచినీళ్ళు వచ్చిరాని పరిస్థితి అన్నారు. 20 ఏళ్లుగా ఎంతో మంది ప్రజా ప్రతినిధులు మారిన, అధికారులు మారిన మా కాలనీలో డ్రైనేజీలు,సిసి రోడ్లు లేకపోవడం బాధాకరమన్నారు. ఓట్ల కోసమే మా ఇంట్లో చుట్టూ తిరుగుతారని ఓట్లు వేసుకున్న తర్వాత ఒక ప్రజాప్రతినిధి గాని ఒక అధికారి గాని పట్టించుకోరని అన్నారు..డ్రైనేజీ లేక మురికి నీళ్లన్నీ రోడ్డు మీద వెళ్తాయన్నారు. రోడ్లన్నీ గుంతల మయంగా ఉన్నాయని మాపై దయవుంచి మా కాలనీని పట్టించుకొని డ్రైనేజీలు, సిసి రోడ్లు వేయాలని జిల్లా కలెక్టర్ కు మొర పెట్టుకున్నారు. ప్రజావాణి లో గ్రామానికి చెందిన కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News