Tuesday, March 17, 2026

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకించాలి

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : ఈనెల ఒకటిన కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను నిరసిస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయం, శ్రామిక భవన్ నుండి మెయిన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో నిరసన తెలుపడం జరిగింది.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వై. యాకయ్య మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విదమైనదిగా ఉన్నదని అన్నారు. విద్య, వైద్యం, రైతు, సంక్షేమం తదితర రంగాలను ఈ బడ్జెట్ విస్మరించిందని అన్నారు. బడ్జెట్ సామాన్యులను దోచి సంపన్నులకు పెట్టినట్టు ఉందని అన్నారు. ఇలాంటి బడ్జెట్ తో పేదలకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. ఇప్పటికైనా బడ్జేట్ ను సవరించాలని, ప్రాధాన్యత రంగాలకు అధిక కేటాయింపులు జరిగేలా చూడాలని లేని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, గోదావరిఖని పట్టణ కార్యదర్శి ఎ.మహేశ్వరి, కమిటీ సభ్యులు వి. నాగమణి లతోపటు నవీన్, భాస్కర్, అనూష, రజిత, మనెమ్మ, అరుణ జ్యోతి, సరిత,లక్ష్మీ, లావణ్య, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News