- కెఎల్ఆర్
- స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కిచ్చెన్న పిలుపు
- టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో రుణమాఫీ కానివారికీ చేస్తాం
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లాలో కందుకూర్, మహేశ్వరం మండలాల్లో పంచాయతీ ఎన్నికలే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. ఇవాళ తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించాలని ఈనెల 15లోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు హస్తం పార్టీ నేతలు సిద్ధం కావాలని కేఎల్ఆర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు అవుతున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ, రూ.500 గ్యాస్ సిలెండర్లు, ఆరోగ్యశ్రీ సహా ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డుల అమలుపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు, పదవులు ఇస్తామని కొత్తవారిని గౌరవిస్తామన్నారు కిచ్చెన్న పాత పద్దతిలో ఎన్నికలు జరిగితే పోటీ చేసే నాయకులు రిజర్వేషన్ల ప్రకారం సిద్ధం కావాలని లక్ష్మారెడ్డి అన్నారు. ప్రస్తుతానికి నియోజకవర్గ మహేశ్వరం, కందుకూర్ మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలే జరుగుతాయని దీనిపై ముఖ్యమంత్రి తో మాట్లాడినట్లు కేఎల్ఆర్ తెలిపారు. కొంతమంది పార్టీ నాయకులుమున్సిపాలిటీలుగా మార్చాలని వినతులు ఇచ్చారని అయితే ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున్న గ్రామ పంచాయతీ ఎన్నికలే జరుగుతాయని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ నందిగామ నరసింహా, మైనార్టీ ఛైర్మన్ యూసుఫ్ ఖాద్రీ, శివగంగా టెంపుల్ ఛైర్మన్ ఆలే కుమార్ ముదిరాజ్, జ్ఞానేశ్వర్ యాదవ్, విష్ణువర్దన్ రెడ్డి, వెంకటేశ్ గౌడ్, రవికుమార్, భాస్కర్, ఫజిల్ ఖాద్రీ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.





