నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మాధవ్ అన్నారు. హైదరాబాదులోని టూమర్ రిజల్ట్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లో సమాచార హక్కు చట్టం 2005 పై రెండు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. మొదటి రోజైన జరిగిన శిక్షణ తరగతుల్లో సమాచార హక్కు చట్టాన్ని పటిష్టపడడం పరచడానికి, రాష్ట్రంలోని ప్రతి పౌరుడు సమాచార చట్టం హక్కు ద్వారా ఏమేమి సమాచారం పొందవచ్చు తెలుసుకోవడానికి అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవకాతవకలను సమాచార హక్కు ద్వారా ప్రశ్నించడానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడానికి హక్కులు ఉపయోగపడతాయని అని తెలిపారు. హక్కులను సాధించడానికి ప్రతి పౌరుడు కూడా విధిగా సమాచార హక్కు గురించి తప్పనిసరి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినా సింగరేణి కంపెనీలో పనిచేసిన ఉద్యోగులు అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగుల లకు సంబంధించిన రావాల్సిన గ్రాడ్యుటి పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, సెటిలింగ్ అలవెన్స్ తదితర చెల్లింపులపై సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చు అని అన్నారు. అదేవిధంగా కార్మికులకు సంబంధించిన గృహ వసతి, ప్రమోషన్ పాలసీ బదిలీలు. తదితర విషయాల్లో కూడా ప్రశ్నించే విశృత అధికారము సమాచార హక్కు చట్టానికి ఉందని తెలిపారు. విషయాలపై అవగాహన పెంచుకోవడానికి నిర్వహించిన రెండు రోజులపాటు శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ డిపార్ట్మెంట్లు చెందిన ఉద్యోగులు అధికారులు అదేవిధంగా మంచిర్యాల రామగుండం, హైదరాబాదు ప్రాంతాల నుంచి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున ఆళవందార్ వేణుమాధవ్ రాళ్ల బండి రాజన్న, పెద్దపల్లి కోటిలింగం, మెరుగు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.





