Monday, March 16, 2026

వైభవంగా శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవం

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల): తిరుచానూరు స్వర్ణముఖి నది తీరంలో నందనవనం రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆలయంలో వేద పండితులు,మంగళ వాయిద్యాలు, భక్తుల జై దత్తా నామ స్మరణల నడుమ శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దత్తాత్రేయ ఆలయ ట్రస్టు సభ్యులు, ఎస్వీ యూనివర్సిటీ రిటైడ్ ప్రాపసర్ ఆచార్య కందుకూరు శేషయ్య సొంత నిధులతో నిర్మించిన దత్తాత్రేయ ఆలయాన్ని,రాయల చెరువు పీఠాదిశ్వరి శ్రీ మాతా రామ్యానంద భారతీ మహా స్వామి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి సోమవారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా రామ్యానంద భారతీ స్వామి మాట్లాడుతూ తిరుచానూరు సమీపంలో శ్రీ దత్తాత్రేయ స్వామి చేరుకోవడం శుభ పుణ్యప్రదం, మనమంతా దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడంతో దత్తాత్ర్రేయ స్వామి అనుగ్రహం ప్రతీ ఒక్కరికీ ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. అదే విధంగా బిజెపి తిరుపతి జిల్లా అధ్యక్షులుగా సామంచి శ్రీనివాస్ ఆలయాన్ని సందర్శించి, తిరుచానూరు సమీపంలో ప్రశాంత వాతావరణంలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం నిర్మించి,దర్శన భాగ్యం కల్పించిన శేషయ్యకు ధన్యవాదాలు తెలిపారు. హిందూ సనాతన ధర్మం మరింతగా పరిడిల్లాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యులు,స్థానికులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News