Tuesday, March 17, 2026

హన్మకొండ, వరంగల్, కాజీపేట ఏరియా ప్రజలకి విజ్ఞప్తి

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు): అభివృద్ధి పనుల లో భాగంగా హన్మకొండ లోని అలంకార్ సెంటర్ కి దగ్గర్లో ములుగు X రోడ్ నుండి వేయిస్తంభాల గుడి వైపు వచ్చే దారిలో డ్రైనేజీ వాటర్ పోవడం కోసం మెయిన్ రోడ్ పై డ్రైన్ నిర్మించవలసి వచ్చింది. రెండు వైపులా వచ్చే, వెళ్లే వాహనాలను ఒక వైపు నుంచి వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం (3-2-2025) నుండి లారీలు, ఆర్టీసీ బస్సులు, రెడీమిక్స్ వాహనాలు, ట్రాక్టర్లు, మరియు ఇతర కమర్షియల్ వాహనాలను ములుగు X రోడ్డు నుండి వేయి స్తంభాల గుడి మీదుగా అనుమతించబడవు. కనుక ఇట్టి వాహనాలు అన్ని ములుగు X రోడ్డు నుండి పెద్దమ్మగడ్డ నుండి కేయూ జంక్షన్ వైపు ప్రయాణించాలి. అలాగే హన్మకొండ బస్టాండ్ , నక్కలగుట్ట, కాజీపేట వైపు వెళ్ళవలసిన టూవీలర్స్, ఆటోలు, కార్లు మొదలగు వాహనాలు అలంకార్ సెంటర్, కాపువాడ, బాలంజినేయ స్వామి దేవాలయం మీదుగా ప్రయాణించాలి మరియు వేయి స్తంభాలు గుడి నుండి అలంకార్ సెంటర్ వరకు, అలంకార్ సెంటర్ నుండి బాలాంజినేయస్వామి దేవాలయం వరకు రోడ్ కి రెండు వైపులా ఎటువంటి వాహనాలు పార్కింగ్ చేయరాదు. మరియు రిపేరింగ్ వాహనాలను రోడ్ పై రిపేర్ చేయరాదు. ఈ మార్గంలో ఇతర తోపుడు బండ్లు కూడా అనుమతించబడవని, ఈ మార్గంలో ప్రయాణించే వారు ఇతర రోడ్లలో ప్రయాణించి తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ వాహనదారులకు సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News