- దివ్యాంగుడైనా స్వయం కృషి తో ఆటో నడుపుతూ
- అన్నార్థుల ఆకలి తీరుస్తున్న దివ్యంగా యువకుడు
నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): కోరుట్ల పట్టణానికి చెందిన చెట్టిపెల్లి ఓం ప్రకాష్ గారు దివ్యాత్వాన్ని జయించి శుభాకార్యలలో మిగిలిన ఆహారం తన ఆటోలో తీసుకోని,నిరుపేద పిల్లలకు పంచడంలో తనవంతు సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు.దీనికి గుర్తింపుగా తెలంగాణ పట్టా భద్రుల సంఘము 8వ, వార్షికోత్సవo సందర్బంగా నేడు కరీంనగర్ కళాభారతి లో తెలంగాణ దివ్యాంగ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మరియు సుడా చైర్మన్ నరేందర్ చేతుల మీదుగా అతడికి “జీవిత సాపల్యత” అవార్డుతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా చెట్ పెల్లి ఓంప్రకాష్ ఆనందం వ్యక్తం చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నన్ను ఎంపిక చేసి ఈ అవార్డు ప్రకటించిన TDGA సంఘానికి మరియు ఈ అవార్డు అందచేసిన ముత్తినేని వీరయ్య మరియు నరేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు రావడంతో నా మీద మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు.





