నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి ): కోరుట్ల పట్టణంలో జరుగుతున్న ప్రెస్టీజియస్ కోరుట్ల ప్రీమియర్ లీగ్ (KPL) క్రికెట్ టోర్నమెంట్‌కి యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రముఖ సామాజిక సేవకుడు మహమ్మద్ ముజాహిద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించిన ముజాహిద్, క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంచడమే కాకుండా, క్రమశిక్షణ, సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. యువత క్రీడల ద్వారా ప్రేరణ పొందాలని, కష్టపడే అలవాటు చేసుకోవాలని సూచించారు. క్రీడాకారులు కేవలం విజయాన్ని మాత్రమే లక్ష్యంగా కాకుండా, నిజమైన క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని ముజాహిద్ తెలిపారు. టోర్నమెంట్‌ను విజయవంతం చేయడానికి కృషి చేసిన నిర్వాహకులను, ఆటగాళ్లను మరియు స్థానిక ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పాల్గొన్న మొహమ్మద్ మసీయోద్దీన్. అబ్దుల్ బారి. మహమ్మద్ ముజాహిద్ చేతుల మీదుగా ప్రదానం చేయబడింది. ఈ గౌరవాన్ని అందుకున్న ఆటగాడు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తన విజయానికి సహకరించిన జట్టు సభ్యులకు మరియు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.





