నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాటశాలలో వసంత పంచమి వేడుకలు సోమవారం ఘనగా నిర్వహించారు. సరస్వతిదేవి విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం పిల్లలచే సామూహిక అక్షర అభ్యాసం చేయించారు. సరస్వతి దేవి ఆవాహన పూజ, హోమము, సామూహిక అక్షర అక్షరాభ్యాసం జరిపారు. చిన్నారులు వివిధ సాంప్రదాయ దుస్తుల్లో అందరిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా సరస్వతీ అమ్మవారి కటాక్షం ఉండాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.





