Tuesday, March 17, 2026

ఎండపల్లి మండల పరిషత్ కు ఎంపీటీసీ స్థానాలు ఖరారు

  • చెర్లపల్లి-గుల్లకోట మినహ, మిగితా స్థానాలు యథావిధిగా కొనాసాగింపు

నేటి సాక్షి, ఎండపల్లి(రియాజ్): నూతన మండల పరిషత్ ఏర్పాటుకు ఎట్టకేలకు ఎనిమిది మండల ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాలను ఖరారు చేస్తూ సోమవారం ప్రభుత్వం తుది జాబీతాను విడుదల చేసింది. దీంతో ఇదివరకు గత నెల 30న విడుదల చేసిన ఎంపీటీసీల స్థానాల ప్రతిపాదనల ముసాయిదా జాబీతాపై వచ్చిన ప్రజల నిరసన, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రజల అభీష్టం మేరకు అనుకూలంగా ఎంపీటీసీ స్థానాలను ప్రకటించింది. ఇందులో గతంలో జగదేవ్ పేట-చర్లపల్లి ఉమ్మడి గ్రామాలకు ఒక్క ఎంపీటీసీ స్థానం ఉండగా ఉమ్మడి వెల్గటూర్ మండలంను విభజించి నూతన ఎండపల్లి మండలం ఏర్పాటులో భాగంగా జగదేవ్ పేట నుండి చర్లపల్లి విడిపోగా ఈ జాబితా ప్రకారం గుల్లకోట-చర్లపల్లి ఉమ్మడి గ్రామాలకు ఒక్క ఎంపీటీసీ స్థానంగా మార్పు జరిగింది. మిగితా ఏడు స్థానాలు అంబారిపేట-కొండాపూర్, ఎండపల్లి, రాజారాంపల్లి, కొత్తపేట-పడకల్, పాతగూడూర్-సూరారం, గొడిశెలపేట-సానబండ, ముంజంపల్లి-మారెడుపల్లి-ఉండెడ ఎంపీటీసీ స్థానాలు గతంలో ఉన్నట్లే యథావిధిగా కొనసాగిస్తున్నట్లు తుది జాబితా విడుదల చేశారు. ఈ జాబీతా విడుదలతో అటు నాయకులలో ఇటు ప్రజలలో ఉన్న ఆందోళన, అనుమానాలకు నివృత్తి లభించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News