Tuesday, March 17, 2026

శ్రీ శక్తి పీఠం లో కన్నులపండువగా శ్రీ రాజశ్యామలా దేవి నవరాత్రులు

నేటి సాక్షి తిరుపతి జిల్లా, (బాదూరు బాల) : రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు కట్ట వద్ద వెలసిన శ్రీ శక్తి పీఠంలో శుక్రవారం శ్రీ రాజశ్యామలా దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాదీశ్వరి మాతజీ శ్రీ శ్రీ శ్రీ రమ్యానందభారతీ స్వామినీ దివ్య సమక్షంలో దేవికి పంచామృత అభిషేకం ఘనంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాజశ్యామలా దేవికి పసుపు, కుంకుమ లతో అలంకరణ మరియు హోమం జరిగినది. స్త్రీ మూర్తులకు సువాసినీ పూజ నిర్వహించారు. రథసప్తమి సందర్భముగా సూర్య భగవానునికి అభిషేకము విశిష్ట పూజ శ్రీ సూర్యభగవానుని ప్రీతిగా, సమస్తవిధ బాధ నివారణ కొరకు, దీర్ఘకాలిక వ్యాధి నివారణకు, మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం కొరకు శ్రీ మార్తాండ భైరవ హోమము, అరుణ పారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శక్తి పీఠం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీఠం కార్యనిర్వాకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ప్రసాదాలు అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News