నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రోజున రథసప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహనంపై శ్రీ పద్మావతి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం రథముపై పురవీధుల గుండా ఊరేగింపులో వెళ్ళగా, మహిళలు, కోలాటాలు మరియు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బిర్నంది నరసింహ చారి, ఈవో ఎం విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ పైడిపల్లి నరసయ్య, భక్తులు, మహిళలు పాల్గొన్నారు





