

నేటి సాక్షి, మందమర్రి:- పట్టణ మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ చాంబర్లో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, శాఖధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించి, సిఎస్ఆర్ పథకం కింద వచ్చిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం పట్టణంలోని 3వ వార్డు చేత్లాపూర్ డంపింగ్ యార్డ్ లోని డంపింగ్ యార్డు ను సందర్శించి, సిబ్బందికి తడి, పొడి చెత్తను వేరు చేయాలని పలు సూచనలు జారీ చేశారు. అనంతరం పట్టణంలోని ఎస్వీ టెంపుల్ ఏరియాలో గల నర్సరీని సందర్శించి, రాబోయే వేసవికాలం దృష్ట్యా మొక్కలకు షేడ్ నెట్ కట్టాలని, అదేవిధంగా పండ్ల మొక్కలను అధికంగా పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఇంజనీరింగ్ ఎం. సుమతి, శానిటరీ ఇన్స్పెక్టర్ వి. శ్యాంసుందర్, రెవెన్యూ అధికారి పి. కృష్ణ ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.





