Tuesday, March 17, 2026

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలోని యాపల్ ప్రాంతంలో జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా పట్టణ పోలీస్ సిబ్బంది, జాతీయ రహదారి సిబ్బంది మంగళవారం రోడ్డు ప్రమాదాలు నివారణకు చర్యలు చేపట్టారు. మందమర్రి సీఐ కే శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్సై ఎస్. రాజశేఖర్, జాతీయ రహదారి అధికారులతో కలిసి సమీక్ష జరిపి, రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాలను గుర్తించి రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న రైలింగ్ లను పూర్తిగా మూసి వేశారు. గత సంవత్సరంలో ఈ రైలింగ్ ల మధ్య గల సందుల గుండా ప్రజలు రోడ్డు దాటడం వలన, ఇతర కారణాల వలన ప్రమాదాలు జరిగి, నలుగురు మరణించగా, ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారని, రైలింగ్ సందులు మూసివేయడంతో ప్రమాదాలను కొంత మేరకు నివారించవచ్చునని వారు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News