- పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు
నేటి సాక్షి, మందమర్రి:- పట్టణ ప్రజలు తమ ఆస్తి పన్నులు, నీటి చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, వాణిజ్య పన్నులు మార్చి 31, 2025 లోపు చెల్లించి, పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు మంగళవారం ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పన్నులు చెల్లించని వారిపై తెలంగాణ పురపాలక చట్టం 2019 నందలి సెక్షన్ 100(2) ప్రకారం ప్రతి నెల 2 శాతం వడ్డీ పై వడ్డీ పడి భారం పడుతుందని తెలిపారు. పట్టణ ప్రజలు సకాలంలో ఆస్తి పనులు, నీటి చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, వాణిజ్య పన్నులను తమ వద్దకు వస్తున్నటువంటి బిల్ కలెక్టర్లకు, వార్డు అధికారికి చెల్లించగలరని సూచించారు. లేనిపక్షంలో తెలంగాణ పురపాలక చట్టం 2019 నందలి సెక్షన్ 87 ప్రకారం వారి ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందన్నారు.





