Tuesday, March 17, 2026

సింగరేణిని నిండా ముంచిందే కేసీఆర్, కవిత

  • టీబీజీకేస్ నాయకులు

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : పెద్దపల్లి పర్యటనలో భాగంగా INTUC కాంగ్రెస్ ఫై కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఐఎన్టియుసి యూనియన్ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్. 10 ఏళ్ళు సింగరేణిని నిండా ముంచి ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతున్నారని దుయ్యబట్టారు ముఖ్యంగా మాజీ ముఖ్య మంత్రి KCR శ్రీరాంపూర్ లో కార్మికుల సమావేశం ఏర్పాటు చేసి పదివేల కోటర్లు కడతాను అని కట్టాడా దీనికి కవిత సమాధానం చెప్పాలని, మారు పెర్ల మార్పు గురించి మాట్లాడిన కవిత BRS పదేళ్లలో ఏం చేశారో చెప్పాలని, తను MP గా ఉన్నపుడు బోగ్గు బ్లాకుల వేలం వేయటం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన MMDR యాక్ట్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే అని. 10 ఏళ్లు అధికారం లో ఉండి ఇక్కడ TBGKS నాయకులు సింగరేణి కార్మికుల రక్తం తాగితే కోల్ బెల్టు ఏరియా లో కార్మికులు BRS ను బొంద పెట్టారని. అలాగే కాంగ్రెస్ ప్రజాపాలనలో కార్మికులకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ప్రారంభించామని అలాగే ఒప్పంద కార్మికులకు 40 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాం అని, పెండింగ్లో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేశామని దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒప్పంద కార్మికులకి లాభాల్లో ఐదువేల రూపాయల లాభాలు పంచి హక్కును కల్పించామని గోదావరిఖని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ప్రజా పరిపాలన ఏర్పడిన వెంటనే ఎన్నో ఎళ్లుగా పెండింగ్లో ఉన్న డిపెండెంట్ కార్మికుల వయోపరి 35 నుంచి 40 సంవత్సరాల పెంచామని, నూతన బొగ్గు గనుల ప్రారంభానికి కృషి చేస్తున్నామని, పదేళ్లలో లైనీ బ్లాకులో తట్టెడు మట్టి కూడా తీయని BRS ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడిన వెంటనే బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టామని బీసీ లైసనింగ్ ఆఫీసర్ ను నియమించామని, నిరుద్యోగుల కోసం శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామని. గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News