నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలో ముదిరాజ్ ల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి మంగళవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నెల్లి రాజలింగు, గరిగే సుమన్ ముదిరాజ్, కొలిపాక సదానందం లు మాట్లాడుతూ, ముదిరాజ్ కులస్తులు ఏ కార్యక్రమం నిర్వహించిన కుల ఆరాధ్య దైవంగా భావించే పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పెద్దమ్మ తల్లి ఆలయాలు నిర్మించుకోవాలని, భవిష్యత్ లో ప్రభుత్వం సైతం అన్ని గ్రామాల్లో పెద్దమ్మ తల్లి ఆలయాలు అధికారికంగా నిర్మించాలని కోరారు. పెద్దమ్మ తల్లి ఆలయాలు ఐక్యమత్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని, జాతి ఐక్యత అభివృద్ది కోసం పాటు పడతాయని తెలిపారు. ఈ ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించి తోడ్పడాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు కొమురయ్య, పిల్లి మల్లయ్య, కుందాల ఓదెలు, అంకం రాములు, భీమరి సదానందం, చెప్పాల రమేష్, బండారి కనకయ్య, పిల్లి మల్లేష్, బండారి రమేష్, పూలు కుమార్ స్వామి, పిల్లి శ్రీనివాస్, నెల్లి వీరన్న లు పాల్గొన్నారు.





