Tuesday, March 17, 2026

నిట్ వరంగల్‌ లో రిజిస్ట్రార్‌ గా సుశీల్ కుమార్ మెహతా బాధ్యతలు స్వీకరణ

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) :
నిట్ వరంగల్‌ లో సుశీల్ కుమార్ మెహతా రిజిస్ట్రార్‌ గా ప్రొఫెసర్ ఎన్.వి. ఉమా మహేశ్ నుంచి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం నిట్ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యధర్ సుబుధి సమక్షంలో జరిగింది. సుశీల్ కుమార్ మెహతా ప్రస్తుతం ఉత్తర ప్రాంతం డైరెక్టర్‌ గా బోర్డు ఆఫ్ అప్రెంటిస్‌ షిప్ ట్రైనింగ్ ఉన్నత విద్యా విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ లో పనిచేస్తున్నారు. నిట్ వరంగల్ రిజిస్ట్రార్‌ గా ఆయన డిప్యూటేషన్‌ పై పదవి స్వీకరించారు. సుశీల్ కుమార్ మెహతా సుమారు 25 ఏళ్లకు పైగా పరిపాలనా అనుభవాన్ని కలిగి ఉన్నారు. రిజిస్ట్రార్‌ గా ఆయన ఐదేళ్లపాటు సేవలు అందించ నున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News