- ప్రణవ్ బాబు డబులు బెడ్ రూమ్ లను సందర్శించడం హాస్యాస్పదం
- పేదలకేనని హైకోర్టులో రిట్ పిటిషన్ నడుస్తుంది
- రంగాపూర్ మాజీ సర్పంచ్, బిజెపి జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు డబులు బెడ్ రూమ్ లను సందర్శించడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో ఈటల రాజేందర్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు రంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోగల సర్వే నెంబర్ 212లో 328 ఇండ్లు మరియు సర్వే నంబర్ 312లో 170 ఇల్లు నిర్మించారు. కానీ ఇప్పటివరకు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మూడు సంవత్సరాలయినప్పటికీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం గానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ డబుల్ బెడ్ రూమ్ల పంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి సంవత్సరకాలం సుంకరిల కళ్యాణ లక్ష్మి చెక్కులు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు షాదీ ముబారక్ చెక్కులు పంచకుంట సంవత్సరకాలం గడిపారే తప్ప ఎక్కడ డబుల్ బెడ్రూంలు పేదలకు పంచదామని ఆలోచన చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తున్న ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నం చేయకుండా ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు సందర్శించడం హాస్యస్పదంగా ఉంది డబుల్ బెడ్రూంలో పంచడంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని చిత్తశుద్ధి లేదు అలాగే సర్వేనెంబర్ 212 మరియు 312 పూర్తిగా రంగాపూర్ గ్రామ పంచాయతీకి పరిధిలోకి చెందింది. ఇందులో మొదటగా రంగాపూర్ గ్రామంలోని పేదలను గుర్తించి పంచాలని గౌరవ ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 9923/2023 అప్పటి సర్పంచ్గా కేసు వేయడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు పెండింగ్లో ఉంది. అయినప్పటికీ ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ లో పంచడానికి అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం గాని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ చొరవ తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాపం పత్రిక మిత్రులకు ఇల్లు అడుగు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి మాకు ప్రభుత్వం కేటాయించిందని సంబరంతో ప్రతి పేద విలేకరి లక్ష నుండి లక్ష 50,000 రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేయడం జరిగింది. దీనిపైన కాంగ్రెస్ నాయకులు హైకోర్టుకు వెళ్లి వారి పొట్ట కొట్టడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో పొద్దున లేస్తే ప్రజల సమస్యలు రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు అన్ని వర్గాల సమాచారాన్ని ప్రజలకు చేరవేసే విలేకరుల పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు ఆశపడుతున్న ఐదు లక్షల ఇల్లు ఎక్కడ ఇస్తారు అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న అన్నీ తెలిసిన విలేకరులనే ఇబ్బంది పెట్టినప్పుడు ఏమీ తెలియని ప్రజలను ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ మోసం చేయడం వాస్తవం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న అలాగే దళిత బంధు విషయంలో ఎన్నోసార్లు గత టిఆర్ఎస్ ప్రభుత్వం లో రెండో విడత మంజూరు చేయాలి వారికి ఎలాంటి నిబంధనలు పెట్టకుండా రెండో విడత వారి అకౌంట్లో ఉన్న పైసలు వారికి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నోసార్లు పలివేదికలపై ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఆ ప్రభుత్వం రెండేళ్లు తత్చారం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చే 14 నెలలైనా ఇప్పటివరకు మేము రెండో విడత ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప ఏ ప్రకారం ఇస్తారు మళ్లీ గత ప్రభుత్వం ఇచ్చినట్టే బిల్లులు తదితరులు చూపిస్తేనే ఇస్తామంటే ప్రతి దళితులు జీఎస్టీ పేరుతో లక్ష రూపాయలు కమిషన్ పేరుతో లక్ష రూపాయలు మోసపోవడం జరుగుతుంది ఐదు లక్షల్లో దళితులకు కేవలం రెండు నుండి మూడు లక్షల మాత్రమే లబ్ధి చేకూరుతుంది అంటే ఐదు లక్షలు ఇస్తామని చెప్పి దళితులకు రెండు మూడు లక్షలు చేరితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న బేసిరతుగా దళిత బంధు రెండో విడత లబ్ధిదారులకు వారు ఇల్లు కట్టుకుంటే ఇల్లుకు లేదా వారి ఏదైనా వ్యాపారం చేసుకుంటే వ్యాపారానికి ఎటువంటి నిబంధనలు లేకుండా ఖర్చు పెట్టుకునే విధంగా వారికి అవకాశం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్స్ ఇస్తుంది. ఇప్పటికైనా ఈ ప్రాంత టిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గాని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు గాని కేవలం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచడానికి తప్ప ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పాటు లేదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వెంటనే రాష్ట్రంలో పెట్టే బడ్జెట్లో ఈ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి కోసం మరియు వివిధ అభివృద్ధి పథకాల కోసం నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.





