నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు)
హన్మకొండ జిల్లా పరకాల పట్టణం లో టాస్క్ ఫోర్స్ ఇన్ఫర్మేషన్ మేరకు పరకాల సిఐ క్రాంతి కుమార్ ఉత్తర్వుల మేరకు పరకాల-హనుమకొండ రహదారిపై ఎస్ఐ శివకృష్ణ, సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమాన స్పదంగా కనిపించడం తో వారి వద్ద నాలుగు బ్యాగులు ఉన్నాయి. అయితే ఆ బ్యాగులో ఏమున్నాయని ప్రశ్నించగా అనుమానం తో భయంతో గంజాయి ఉన్నదని సమాధానం చెప్పినారు వారి వద్ద 41 కేజీల ఎండు గంజాయి ఉన్నది వారు చెప్పడం జరిగిందని, ఎటు వెళుతున్నారని అడగ్గా ఒరిస్సా నుండి ముంబైకి తరలిస్తున్నట్టు వారు చెప్పడం జరిగిందని, వాళ్ల పేర్లు ప్రేమందా దాస్ S/o భరేంద్ర దాస్ వయసు 31 సంవత్సరాలు కులం యాదవ వృత్తి వ్యవసాయం R/o గొలబంద బలేశ్వరం జిల్లా ఒరిస్సా. ఇతని బామ్మర్ది అయినా సౌమ్య రంజన్ రౌత్ S/o శరత్ రౌత్ వయసు 22 సంవత్సరాలు కులము యాదవ వృత్తి స్టూడెంట్ R/o ఆస్ట్రియా పతన్ భవలేశ్వరం జిల్లా ఒరిస్సా వీరి వద్దనుండి స్వాధీనం చేసిన గంజాయి విలువ రూ. 10,27,250 రూపాయలు వీరిపై కేసు నమోదు చేయడం జరిగిందని సిఐ క్రాంతి కుమార్ తెలిపారు.

