Wednesday, March 18, 2026

వార్డును ఇంటిలా చూసుకున్న కేసిరెడ్డి – ప్రజల సేవకు ఎప్పటికైనా రెడీ

  • పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ద
  • అభివృద్ధి – సంక్షేమంలో ఆదర్శం అవార్డు
  • తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి రెడ్డి ని అభినందిస్తున్న వార్డు ప్రజలు

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ లో ప్రముఖ వాణిజ్య వ్యాపార కూడలి గా పేరున్న సూపర్ బజార్ రోడ్, అంబేద్కర్ చౌరస్తా, పాపారావు బొంద, వివేకానంద చౌరస్తా, పొలీస్ స్టేషన్, డాక్టర్స్, మెడికల్ హబ్, టెలిఫోన్ భవన్, పోస్ట్ ఆఫీస్, హోటళ్లు, బేకరీ, లాడ్జీలు లాంటి సముదాయాలు కల్గి ఉండి నిత్యం బిజీగా, ఎక్కువ సివిలైజేషన్ ఉన్న ప్రాంతంగా ప్రతినిత్యం గ్రామాల నుండి వచ్చే సందర్శకులతో సందడిగా విరాజిల్లుతున్న పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డులో గత మూడు పర్యాయాలు వార్డు సభ్యులుగా, నగర పంచాయతీ సభ్యులు, ప్రస్తుతం మున్సిపల్ లో తాజా మాజీ కౌన్సిలరు గా ప్రజలకు సేవలను అందిస్తున్న కేసిరెడ్డి లావణ్య – నర్సింహారెడ్డి లకు వార్డులో పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తోంది. గత మూడు పరియాలు జరిగిన ఎన్నికల్లో వరుసగా లావణ్య నరసింహారెడ్డి విజయదుందుభి మోగిస్తున్నారు. ప్రత్యక్షంగా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో లావణ్య, పరోక్షంగా అన్ని సేవ కార్యక్రమాల్లో నర్సింహారెడ్డి పాల్గొంటూ, వార్డు అభివృద్ధి, ప్రజల్లో తలల నాలుక లాగా మమేకమై పనిచేస్తున్నారు. అన్నీ సమస్యలు పరిష్కరిస్తూ వార్డులో డ్రైనేజీలు, సీ సీ రోడ్లు, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛ మంచినీరు, వీధి లైట్లు, ఇంటికో చెట్టు, ఇంటి నుండి చెత్త సేకరణ లాంటి వంద శాతం పనులను పూర్తి చేశారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఆసరా ఫించన్లు, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్, సి ఎం ఆర్ ఎఫ్ ఇప్పించడం లో సఫలీకృతం అయ్యారు. వార్డులో 24 మంది దళిత కుటుంబాలకు దళిత బంధు ద్వారా లభ్ది చేకూరింది. 2014, 2023 లో తెలంగాణ ప్రభుత్వంతో వార్డులో ఉత్తమ సేవలు హరితహారం, పారిశుద్ధ్య పనుల్లో రెండుసార్లు ఉత్తమ అవార్డులు అందుకున్నారు. వార్డు సభ్యులు గా ఉన్న సమయంలో నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్లో కూడా పంచాయతీ నుండి వాటర్ ట్యాంకర్ల ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా చేసి శభాష్ అని వార్డు ప్రజలచే అనిపించుకున్నారు. రెండుసార్లు ప్రతి ఇంటికి స్వంత నిధులతో చెత్త బుట్టలు పంపిణీ చేయడం, 2019 లో కరోనా కష్టకాలంలో వార్డుల్లో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడ్డారు. వార్డుల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు వారు చేసిన కృషి మరువలేనిది. వార్డు వ్యాపారులు, ప్రజల సహకారం తో పారిశుద్ధ్య సిబ్బందికి చేయూత అందించారు. సుమారు 110 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఆసరా గా నిత్యావసర వస్తువులు అందచేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. హరితహారం లో భాగంగా ఇంటికో మొక్క, వీధిలో చెట్ల పెంపకంలో విజయం సాధించారు. రోడ్లు, డ్రైనేజీ ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. 15 ఏళ్ల లో అన్ని విధుల్లో డ్రైనేజీలు, సి సి రోడ్లు కొత్తవి నిర్మించారు. సూపర్ బజార్ రోడ్డు ఏంతో అస్తవ్యస్తంగా ఉంటే దాన్ని నిర్మాణం లో ఎంతో కృషి చేశారు. తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం లో అప్పటి మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ తో చర్చించి రోడ్డు ను సుందరంగా తీర్చిదిద్దడం లో వార్డు కౌన్సిలరు కృషి ఎంతగానో ఉంది. జె కె సంది, వెంకటేశ్వర టాకీస్ రోడ్, వడ్ల కేదారి సంది, పాపారావు బొంద, ఇల్లందుల విధి, పోలీస్ క్వార్టర్స్, జమ్మికుంట రోడ్, ఓల్డ్ సూపర్ బజార్ రోడ్ లలో సి సి రోడ్లు, అన్ని విధుల్లో కొత్తగా డ్రైనేజీలు చేపట్టి కాలనీ వాసుల ప్రశంసలు అందుకున్నారు. ఒక్క రూపాయి లంచం, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, అవినీతికి తావు లేకుండా నీతి నిజాయితీ తో వ్యవహరించారనే పేరు తెచ్చుకున్నారు. తాము చేసిన కార్యక్రమాలతో ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవడం గమనార్హం. అందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం, వారి కష్టసుఖాల్లో భాగస్వాములు కావడం, ఏ సమస్య ఉన్న అక్కడ ప్రత్యక్షం కావడం, సమస్య పరిష్కారం అయ్యేవరకు శ్రమించడం, అధికారులతో మునిసిపాలిటీతో మాట్లాడడం పరిష్కరించడం చేశారు. ప్రభుత్వం నుండి వచ్చే నిధులే గాకుండా వ్యక్తి గతంగా కూడా సొంత నిధులు వెచ్చించి అనేక సేవలు అందించారు. పేదలకు ఆపదలో బియ్యం పంపిణీ, ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి శిబిరం విజయవంతం చేయడం, తెలంగాణ ప్రభుత్వం లో నిర్వహించిన హరితహారం, పట్టణ ప్రగతి ని వార్డులో సక్సెస్ చేశారు. ప్రతి రోజు వార్డు పర్యవేక్షణ చేస్తూ సిబ్బందిని ప్రోత్సాహం కల్పించడం, ప్రజలలో ఏమైనా పనులు, సమస్యలు ఉంటే పరిష్కారం దిశగా చూడటం, పోలీస్, రెవిన్యూ, మున్సిపల్ పరంగా ఎన్నో సమస్యలు ప్రజలకు తలెత్తినప్పుడు వాటి పరిష్కారానికి అహర్నిశలు శ్రమించడం, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం లావణ్య – నర్సింహారెడ్డి లకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి.

అందరి కృషి తో అభివృద్ధి: కేసిరెడ్డి లావణ్య – నర్సింహారెడ్డి

2006 లో గ్రామ పంచాయతీ 11 వ వార్డు సభ్యులుగా, 2014 లో నగర పంచాయతీ ఎన్నికల్లో 13 వ వార్డ్ సభ్యులు గా, 2019 మున్సిపల్ ఎన్నికల్లో 26 వ వార్డులో కౌన్సిలరు గా గెలుపొందాను. ప్రజల మద్దతు తో మాజీ మంత్రులు కెప్టెన్ లక్ష్మీ కాంతరావు, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గతంలో ఉన్న సీఎం లు రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలన లో మూడు సార్లు ప్రజలకు సేవలు అందించే అదృష్టం కలిగింది. కేసీఆర్ హయాంలో అన్ని అభివృద్ధి, పింఛన్లు, దళిత బంధు, మిషన్ భగీరథ మంచి నీటి ఎద్దడి లేకుండా చేయడం, డ్రైనేజీలు, సి సీ రోడ్లు లాంటివి చేపట్టి మున్సిపాలిటీ లొనే 100 శాతం పనులు పూర్తి చేసుకున్న 26 వార్డుగా గుర్తింపు తెచ్చునున్నాం. మాజీ ప్రజా ప్రతినిధులుగా ఉన్న మాజీ సర్పంచ్ లు, మాజీ చైర్మన్ లకు కృతజ్ఞతలు. మూడుసార్లు గెలిపించిన ప్రజలు మాకు దేవుళ్ళ తో సమానంగా భావిస్తున్నాం. మరోసారి అవకాశం వస్తే మరింత అభివృద్ధి కి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News