

నేటి సాక్షి, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో 8 నుంచి 12వ తారీకు వరకు జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరీక్షించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శాలువాలతో సన్మానం చేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయ E O వెంకన్న మాట్లాడుతూ దాదాపు పది వేల మందికి పైగా భక్తులు వస్తారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీళ్ల విషయంలో కావచ్చు మూత్రశాలలు శానిటేషన్ వైద్య పరంగా వాహనాలకు పార్కింగ్ లాంటివి భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా చూస్తామని అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ కళ్యాణ మహోత్సవ ఆలయ ఆవరణలో ఉన్న కిరాణా షాపు వేలం 6.2000. తల నీలాలు 6,99000. పట్టే నామాలు కోర మీసాలు 1,71,000. కొబ్బరికాయలు 220000. ప్రసాదం 1,20,000. కొబ్బరి చిప్పల వేలం 45000. ఆటో కి 30 రూపాయలు పెద్ద వాహనాలకు 50 నుండి 100 రూపాయలు పార్కింగ్ టికెట్ ధర ఉంటుందని ఈ రకంగా జాతరలో వచ్చే ఉండి లెక్కలు ని కలిపి ఖర్చులు తీసివేయగా సంవత్సరానికి 60 లక్షల ఆదాయం వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా దేవాలయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ. జిల్లా ఆర్డీవో. డిపిఆర్ఓ. కొడిమ్యాల ఎంపీడీవో స్వరూప. ఎమ్మార్వో రమేష్. ఏఈవో జ్యోతి.ఉన్నత అధికారులు మండల నాయకులు భక్తులు పాల్గొన్నారు





