నేటి సాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలో బుధవారం జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి రాము సందర్శించారు. పాఠశాలలోని రిజిస్టర్లు రికార్డులు పరిశీలించి ఉపాధ్యాయులు రాస్తున్న డైరీలను పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థుల యొక్క స్థాయిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులందరికీ దత్తత ఇచ్చిన విషయాన్ని తెలుసుకున్నారు. విద్యాభివృద్ధి కోసం పాఠశాలలో అమలుపరుచుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకుని పదవ తరగతి లో అత్యున్నత ఉత్తీర్ణత సాధించుటకు ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు అందించ్చి మధ్యాహ్న భోజన వివరాలు తెలుసుకొని జిల్లాలో అమలుపరచుచున్న అపార్ యొక్క స్థాయిని తెలుసుకున్నారు.





