నేటి సాక్షి, రిపోర్టర్ మహబూబాద్ (నరసింహుల పేట) భూక్య రవి : మండలం పడమటిగూడెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన బాధ లచ్చమ్మ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున 5500 ఆర్థిక సహాయంమరియు ఇతర కార్యక్రమాలు అందించడం జరిగింది. గత మూడు నెలల క్రితం ఆమె భర్త కూడా మరణించడంతో అప్పుడు కూడా సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మూడు నెలల వ్యవధి కాలంలో ఆతనీ భార్య కూడా చనిపోయేసరికి వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీశైలం,మాజీ సర్పంచ్ మేకల వెంకన్న, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు పాతూరి వెంకట్ రెడ్డి, మండల నాయకులు పిట్టల లింగయ్య, కుంభాల లింగయ్యదారం, వేదయ అలువాల, యాకన్న జక్కుల యాకన్న, కొమ్ము కుమారు, జొన్నగడ్డ యాకన్న, చిర్ర కృష్ణమూర్తి, గ్రామ పెద్దలు చిర్ర యాకన్న, గువ్వ వెంకన్న, బాధ వెంకన్న గారు పాల్గొనడం జరిగింది.





