నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఉన్న ఏసి కళ్యాణ మంటపం (ఫంక్షన్ హాల్) నిర్వహణ కోసం ఆసక్తి కలిగిన నిర్వాహకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సిఈఓ శ్రీనివాస్ తెలిపారు. ప్రారంభ బిడ్ మొత్తం సంవత్సరానికి రూ. 15 లక్షల నుండి ప్రారంభమవుతుంది. హాల్‌తో పాటు ఒక షట్టర్ కూడా అందించబడుతుందని, ఆసక్తి కలిగిన నిర్వాహకులు తమ దరఖాస్తులను 20.02.2025 లోపు కార్యాలయానికి సమర్పించాలన్నారు. ఒకరికంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన సందర్భంలో, ఓపెన్ టెండర్ నిర్వహించబడుతుందని, దరఖాస్తు చేసుకునే సమయంలో రూ. 50,000 డిపాజిట్ చెల్లించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 96768 06406 చరవాణి లో సంప్రదించండి.





