Tuesday, March 17, 2026

శ్రీశక్తి పీఠం లో వేడుకగా ఏడో రోజు శ్రీ రాజశ్యామలా దేవి నవరాత్రులు ఉత్సవాలు

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రాపురం మండలం పరిధిలోని రాయల చెరువు శ్రీ శక్తి పీఠంలో శుక్రవారం శ్రీ రాజశ్యామలా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాదీశ్వరి మాతజీ శ్రీ శ్రీ శ్రీ రమ్యానందభారతీ స్వామినీ దివ్య సమక్షంలో దేవికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి అనంతరం పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహించారు.శ్రీ రాజశ్యామలా దేవి అమ్మవారికి శుష్క ఫలములతో ప్రత్యేక అలంకరణ చేసి వేదపండితులుచే హోమం జరిగింది ఆలయం లో ఉన్న స్త్రీ మూర్తులకు సువాసినీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శక్తి పీఠం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శక్తిపీఠం కార్యనిర్వాకులు భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News