నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ పట్టణానికి చెందిన గాజుల మనోజ్ (28) అనే యువకుడు పెళ్లి కావడంలేదని మర్రిచెట్టుకు తాడుతో ఉరి వేసుకొని బలవన్మరానికి పాల్పడిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. ఎస్ఐ సుధీర్‌రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మనోజ్‌కు ఇటీవల కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని అయితే పెళ్లి కుదరకపోవడంతో మనస్థాపం చెంది తాగుడుకు బానిసైయ్యాడు. ఇదే బాధతో మంగళవారం రాత్రి ఇంట్లోంచి వెళ్లిన మనోజ్ గ్రామ శివారులోని దేవునిమర్రి చెట్టు వద్దకు వెళ్లి నైలాన్‌తాడుతో ఉరి వేసుకొని శవమై వ్రేలాడుతు కనిపంచడంతో కుటుంబసభ్యులు తమకు ఫిర్యాదు చేసారని ఎస్ఐ వివరించారు. సంఘటన స్థలానికి వెళ్లి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపి నట్లు చెప్పారు. మృతుడి తండ్రి నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మనోజ్ స్థానికంగా టూ వీలర్ బైక్ మెకానిక్‌గా పని చేసేవాడు. అందరితో కలివిడిగా ఉండేవాడని స్నేహితులు తెలిపారు.





