Wednesday, March 18, 2026

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు విప్ లక్ష్మణ్ కుమార్ పాలభిషేకం

నేటి సాక్షి, ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగల బిల్లును ప్రవేశ పెట్టిన సందర్భంగా మరియు అదేవిధంగా ఎస్సీ మరియు ఎస్సీ ఉప కులాల వర్గీకరణ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమోదం తెలిపిన సందర్భంగా బుధవారం రోజున గొల్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు అదే విధంగా బలహీన వర్గాల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ బుధవారం రోజున వారికి ఘనంగా పాలభిషేకం చేయడం జరిగింది. మండల అధ్యక్షులు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇట్టి బీసీ కులగణన ద్వారా బలహీన వర్గాలకు చెందిన ప్రజలు సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి, రాజకీయ రంగాలలో ముందుకు వెళ్లడానికి ఈ బిల్లు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. అదేవిధంగా ఎస్సీ మరియు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం ద్వారా ఎస్సీలలో ఉన్నటువంటి వివిధ కులాల అన్నింటికీ న్యాయం జరుగుతుంది కావున ఇట్టి చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్టి ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ ,వైస్ చైర్మన్ పొరపాటు రాజిరెడ్డి, మాజీ సర్పంచులు చిర్ర గంగాధర్, రేవెల్ల సత్యనారాయణ గౌడ్, కాసరపు అరవింద్ గౌడ్, రేవెల్ల లింగన్న, గౌడ్ మాజీ ఎంపీటీసీ లంబ లక్ష్మణ్, మాజీ ఉపసర్పంచ్ కొండ వెంకటేష్ గౌడ్, అవునూరు శ్రీధర్, ఎమ్మార్పీఎస్ గొల్లపల్లి మండల అధ్యక్షులు చేవులమద్ది రమేష్, ముల్కల శ్రీనివాస్, మ్యక స్వామి, ఒరగంటి జాన్, చేవులమద్ది గంగాధర్, నక్క విజయ్, చేవులమద్ది విక్రమ్, చిర్ర దిలీప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపల్లి గంగన్న రామ్మోహన్ రావు దేవరకొండ శ్యామ్ కాశ గంగాధర్ గడప రవి గురిజాల బుచ్చిరెడ్డి కంది వెంకటేష్మ, టౌన్ అధ్యక్షులు నేరేల్ల మహేష్, నల్ల విక్రమ్ రెడ్డి, రామడుగు తిరుపతి, మరం కుమార్, కట్కూరి రామన్న మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News