నేటి సాక్షి, మెట్ పల్లి (నరేష్.దూలురి) : తల్లి స్కూల్ కు వెళ్లి చదువు కొమ్మని మందలించినoదుకు బాలుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. ఇబ్రహీం పట్నం ఎస్ఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బోధస్ గంగాధర్ (15) స్కూల్ కి వెళ్లకుండా చెడుతిరుగుడు తిరుగుతున్నాడని మృతిని తల్లి రాజవ్వ స్కూల్ కి వెళ్ళమని బుధవారం మందలించి వ్యవసాయ పనులకు వెళ్ళింది. తల్లి మందలించిందని మనస్థాపం చెందిన బాలుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోని దూలానికి చీరతో ఉరి వేసుకొని ఉండగా శబ్దం వినిపించిన మృతుడి చిన్నమ్మ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి కొన ఊపిరితో ఉన్న బాలుడిని హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేపిస్తుండగా మధ్యాహ్నం మరణించినాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.





