Wednesday, March 18, 2026

ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడి మృతి

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని గుల్లకోట గ్రామంలో ఓ బాలుడు చేద బావిలో పడి మృతిచెందిన విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ఆర్.ఉమా సాగర్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని మంత్రి రంజిత్-శిరీషా ల దంపతుల చిన్న కుమారుడు వేదాన్స్ (02) అడుకుంటు సమీపంలోని ఓ చేద బావిలో ప్రమాదవశాత్తూ పడగా కాస్తా అలస్యంగా స్పందించిన తల్లిదండ్రులు అచూకీ కోసం వెతుకగా బావిలో పడి అప్పటికే చనిపోయి ఉన్నట్లు మృత బాలుడి తండ్రి రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. రోజు తమ ఇంట్లో బుడి బుడి అడుగులతో అల్లారు ముద్దు మాటలతో సందడి చేసే బాలుడు మరణించడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనాలు మిన్నంటాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News