Wednesday, March 18, 2026

చౌలమద్ధి లో పశువైద్య శిబిరం

నేటి సాక్షి,మెట్ పల్లి : మెట్ పల్లి మండలం చౌలమద్ది గ్రామంలో పశువర్ధక శాఖ,కోరుట్ల వెటర్నరీ వైద్య కళాశాల ఆధ్వర్యంలో బుధవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా దూడలకు నట్టల నివారణ మందులు వేశారు.అలాగే 7 ఆవులు,32 గేదెలకు చూడి పరీక్షలు, గర్భకోశ వ్యాధి చికిత్సలు నిర్వహించారు. మేకలకు పోచమ్మ వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బక్కయ్య, మండల పశు వైద్యాధికారి డాక్టర్ మనిషా, వెటర్నరీ వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News