నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్,సి.(రాఘవుల శ్రీనివాసు):
మండల స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ప్రధమ స్థాయి బహుమతి పొందిన పెద్దపాపయ్య పల్లి ఉన్నత పాఠశాలకు చెందిన పాకాల యశ్వంత్ రెడ్డిని ఆ పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ అనురాధ విద్యార్ధిని అనునిత్యం గైడ్ చేసి మండల స్థాయిలో ప్రధమ స్థానం లో నిలిపిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు ఆవుల పద్మశ్రీ ని ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుగుణ, ఆవుల పద్మశ్రీ, బేతి తిరుపతి రెడ్డి, మందుల వెంకట రమణారెడ్డి, మావిడాల సతీష్ కుమార్, ఎర్రి శ్రీనివాస్ రెడ్డి, మంద రమేష్ బాబు, దూడ సత్యానందం తదితరులు పాల్గొన్నారు.





