- మాల మహానాడు జిల్లా కన్వీనర్ నీరటి శ్రీనివాస్
నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ పూర్తి రాజ్యాంగ విరుద్ధమని ఇది రాజకీయ కుట్రేనని మాల మహానాడు జిల్లా కన్వీనర్ నీరటి శ్రీనివాస్ అన్నారు. 341 ఆర్టికల్ ను సవరించాలంటే కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల ఆమోదం కావాలి పార్లమెంటులో ఉన్న 60% యస్సి పార్లమెంటు సభ్యుల ఆమోదం కావాలి కాబట్టి,దేశంలో ఉన్న 3/4రాష్ట్రల ఆమోదం కావాలి రాష్ట్రపతి అమోదించాలి, దానిని జాతీయ యస్సి కమీషన్ ద్వారా చట్ట బద్దత కల్పించి చట్టం ద్వారా సవరించడం సాధ్యం కాదు కాబట్టి మోడీగారు దొంగ దారిన సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే అట్టి వర్గీకరణను బుధవారం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2011 లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసిందని ఇది సరైన పద్ధతి కాదన్నారు. 2014వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన సకల జనుల సర్వే ఏటుపోయింది 2024 వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే ఎటుపోయింది, ఈ వర్గీకరణ ముమ్మాటికి బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలా మాలలను అణిచివేయడానికి ఆడుతున్న నాటకం, పార్లమెంట్ ద్వారా చేయాల్సిన ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగ కుట్రలో భాగంగా అసెంబ్లీ ద్వారా తీర్మానం చేస్తూ మాలలకు పూర్తిస్థాయిలో అన్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామన్నారు. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా మాలలను సామాజికంగా అనగదొక్కడానికి చూస్తున్నాయని దానిని సహించేది లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంలో మాలల కృషి ఎంతో ఉందని, వర్గీకరణ చేసిన సరైన పద్ధతిలో చేయాలన్నారు. ఇప్పటికైనా సరైన పద్ధతిలో వర్గీకరణ చేసి అందరికీ సమన్యాయం చేయాలని లేనిచో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతారని తెలంగాణ మాల మహానాడు చందుర్తి మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల కమలాకర్, మండల ఉపాధ్యక్షులు సిరిగిరి సుధాకర్, ఆసినిపర్తి ఏసుకుమార్, చందుర్తి గ్రామాశాఖ అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్, మూడపల్లి గ్రామాశాఖ అధ్యక్షులు నీరటి సురేష్, సంటి ప్రవీన్ , జోగాపూర్ అధ్యక్షులు గోంటి తిరుపతి, మల్యాల అధ్యకులు మదం అశోక్, ఆశిరెడ్డిపల్లి అధ్యక్షులు ఎడ్ల రాజేందర్, లింగంపేట అధ్యక్షులు గోంటి అంజయ్య ,రామన్నపేట అధ్యక్షులు రవీందర్, తిమ్మాపూర్ అధ్యక్షులు కాపిల్ల రాజు, మాల సంఘం నాయకులు బత్తుల అశోక్, సంటి బాబు, బండపల్లి అధ్యక్షులు అన్ని గ్రామాల మాల సంఘ సభ్యులు పాల్గొన్నారు.





