- మంజూరు చేపించిన ప్రభుత్వ విప్ ఆది
నేటి సాక్షి, ప్రతినిధి వేములవాడ ( కోక్కుల వంశీ ) : వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలువురు కి అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ మరియు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు డబ్బులను మంజూరు చేపించారు. ఎల్ఓసి లబ్ధిదారులు వీరే – రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లె కు చెందిన బి. సుజాత కు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం రూ.2 లక్షల 50 వేలు, రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఎల్. సుధాకర్ కు 1 లక్ష , మేడిపల్లి మండలం తొంబర్రావుపేట గ్రామానికి చెందిన బి.ఆర్ సుదర్శన్ కు 2 లక్ష 50 వేలు రూపాయలు మంజూరి చేయించారు. కాగా అత్యవసర చికిత్స నిమిత్తం డబ్బులు మంజూరు చేపించినందుకు బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు.





