నేటి సాక్షి, వేమనపల్లి;
బిజెపి ప్రభుత్వం పేద మరియు మధ్యతరగతి వర్గాలను బలపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బుధవారం మండల కేంద్రం బస్టాండ్ ఏరియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఏటా మధుకర్ మాట్లాడుతూ….కేంద్ర బడ్జెట్ లో వ్యక్తిగత పన్ను మినహాయింపు 12 లక్షలకు పెంచడం ఒక చరిత్రత్మాక నిర్ణయమని,ఈ బడ్జెట్ట్ దేశ అభివృద్ధిలో ముందుకు వెళ్లే విధంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు మడె శ్రీకాంత్,ప్రధాన కార్యదర్శి ఏనుముల వెంకటేష్,బిజెవైఎం మండలం అధ్యక్షులు కంపెల అజయ్,చౌదరి మధునయ్య,దుర్గం పుల్లయ్య,కుబిడే అంజన్న,మడె రాహుల్,మాడె సమ్మయ్య,జంబోజి ప్రభాకర్,దుర్గం వెంకటి,తీగల సతీష్,చౌదరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.





