జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

నేటి సాక్షి మహబూబాద్ నరసింహ పేట భూక్య రవి
బుధవారం నెల్లికుదురు మండలంలో ఉన్న కస్తూరిబా గాంధీ విద్యాలయం (కేజీవిబీ) వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఆయన వసతి గృహంలోని కిచెన్ షెడ్డు, డైనింగ్ హాల్, క్లాస్ రూమ్, స్టోర్ రూమ్, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన డైట్ మెనూ ప్రకారం పక్కాగా అమలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన, ఆహారాన్ని అందించాలని సూచించారు. స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తూ ఉండాలని, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థుల యొక్క మానసిక, ఆరోగ్యం స్థితిగతులను గమనిస్తూ ఉండాలని, షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు, మానసిక వికాస తరగతులను నిర్వహించాలని తెలిపారు. వసతి గృహంలోని పరిసరాలలో ప్రతినిత్యం సానిటేషన్ నిర్వహించాలని సూచించారు. భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ వంటలు సిద్ధం చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారి సాధారణ పర్యటనలో భాగంగా అన్ని వసతి గృహాలను సందర్శించాలని సూచించారు. విద్యతోపాటు క్రీడలు, మానసిక వికాసంపై మంచి ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట కేజీబీవీ ప్రిన్సిపల్ ఇల్లందుల సుమలత, సిబ్బంది పాల్గొన్నారు.





