Tuesday, March 17, 2026

ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

  • కాంగ్రెస్ శ్రేణుల హర్షం

నేటి సాక్షి, బెజ్జంకి:
ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో బెజ్జoకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొంకటి రాములు ఆద్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.మాదిగ మాదిగ ఉపకులాల 30 సంవత్సరాల కల అయిన ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ లకు కృతజ్ఞతలు తెలిపి బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరక్టర్ మచ్చ కుమార్,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లింగాల శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనగాం శంకర్,యూత్ అధ్యక్షులు కర్రావుల సందీప్,మండల ఉపాధ్యక్షులు కర్రావుల శంకర్,జెరిపోతుల మధు,రొడ్డ ఐలయ్య,కనగండ్ల రాజయ్య,బోనగిరి చంద్రయ్య,మాంకాల రాజయ్య,బిగుల్ల బాబు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News