జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
నేటి సాక్షి, మందమర్రి:-
మండలంలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పట్టణ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కడారి శ్రీధర్ కోరారు. బుధవారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికలు, చానల్లో రిపోర్టర్లుగా ఉండి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న వారిలో చాలామంది ఎక్కువగా పేదలు ఉన్నారని, కనీసం సొంత ఇల్లు లేక కిరాయి ఇంటిలో ఉంటూ, ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, ఇండ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చిందని గుర్తుకు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులను గుర్తించి, వెంటనే ఇండ్ల స్థలాలు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.





