నేటి సాక్షి, మెట్ పల్లి:
పోలీస్ విధులకు ఆటంకం కలిగిచించిన వ్యక్తి పై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిరణ్ తెలిపారు.ఆయన తెలిపిన వివారల ప్రకారం..ఆరుద్దీన్ అనే హోంగార్డ్ పాత బస్ స్టాండ్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా,పార్కింగ్ కు విరుద్ధంగా నిలిపి ఉన్న వాహనాన్ని తొలగించే క్రమంలో షేక్ జమాల్ అను వ్యక్తి బెదిరించాడని ఫోన్ చేయగా సంఘటన స్థలానికి వెళ్ళిన పిసి రాజేందర్ ను సైతం బూతులు తిడుతూ దాడికి దిగాడని బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.





