Wednesday, March 18, 2026

శభాష్ కానిస్టేబుల్ అలీ

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు)

ఇతర రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాల సమాచారం అందజేస్తూ నిందితులను పట్టు కోవడానికి సహకరిస్తున్న క్రైమ్ వింగ్ కానిస్టేబుల్ మీర్ మహ్మద్ అలీకి తిరువనంతపురం కొచ్చి, వికారాబాద్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రశంస పత్రాలు పంపించారు. వీటిని కమిషనరేట్లో సీపీ అంబర్ కిశోర్ ఝా బుధవారం అలీకి అందిజేశారు. నగరంలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మీర్ మహ్మద్ అలీ జాతీయ స్థాయి క్రైమ్ విభాగానికి అనుబంధంగా ఉన్న వాట్సాప్ గ్రూప్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ గ్రూప్లో ఉన్న అంతర్ రాష్ట్ర పోలీసులతో సంబంధాలు కొనసాగిస్తూ నేరం ఎక్కడా జరిగిన వెంటనే స్పందిస్తూ నేర పరిశోధనకు అవసరమైన సలహాలు అందించేవారు. ఇందులో భాగంగా ఇటీవల కొచ్చి ప్రాంతంలో దృష్టి మరల్చి బంగారం షాపుల్లో చోరీలకు మహారాష్ట్ర కు మహిళా ముఠాగా గుర్తించి కొచ్చి పోలీసులకు అలీ సమాచారం ఇవ్వగా, తిరువనంతపురం, వికారాబాద్ జరిగిన దొంగతనాల్లో నిందితులను గుర్తించి సంబంధించిన పోలీస్ అధికారులకు అలీ సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితులను పట్టుకొని పెద్ద మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలీ సమాచారం ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకుని రిమాండ్ కు తరలించారు. దీనితో తిరువనంతపురం పోలీస్ కమిషనర్ కిరణ్ నారాయణ్, కొచ్చి పోలీస్ కమిషనర్ సుదర్శన్ తోపాటు వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి వరంగల్ క్రైమ్ వింగ్ కానిస్టేబుల్ అలీని అభినందిస్తూ ప్రశంస పత్రాలు పంపించారు. కాగా, అలీని మట్టెవాడ ఇన్స్ స్పెక్టర్ గోపి వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News