Wednesday, March 18, 2026

ఘనంగా బి.ఆర్ అంబేద్కర్ సతీమణి మాత రమాయి జయంతి వేడుకలు

నేటి సాక్షి, బ్యూరో నిజామాబాద్, టి.ఎన్ రమేష్:
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో జాతీయ మాల మహానాడు జిల్లా కార్యాలయంలో, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సతీమణి మాత రమాయి 127 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి లక్ష్మణ్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుంకరి విజయ, నగర అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రభంజన్, దళిత ఐక్యవేదిక కార్యచరణ మహాసభ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మద్దెల సంతోష్, రాజు, ఇందూరు లావణ్య, రేంజర్ల సునీల్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి దేవత శ్రీనివాస్, కోర్టు లక్ష్మణ్, జాఫర్ తదితరులు, భారీ సంఖ్యలో ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఏర్పాటుకు ముందు, సమాజంలో, మనుసృతి ఆధారంగా పాలన జరిగేదని, బాల్యంలోనే ఆడపిల్లలకు పెద్ద వయసు మగవారితో, బాల్య వివాహాలు చేసి భర్త చనిపోయిన తరవాత, యవ్వనంలో ఉన్న మహిళలను నిర్దాక్షిణ్యంగా సత్తి సహగమనం పేరిట, భర్త యొక్క చితిమంటలపై బలవంతంగా యుక్త వయసులో ఉన్న స్త్రీలను, బాలికలను భర్త చితి కాలుతున్న మంటలోకి, తోసివేసి హత్యలు గావించే సంస్కృతి రాజ్యాంగానికి ముందు ఉండేదని తాళ్లపల్లి రవి అన్నారు. బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చాక, 1950లో జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చి, స్త్రీలకు పురుషులకు, బడుగు బలహీన వర్గాల కు అందరికీ సమానమైన హక్కులు, అధికారాలు, రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించడం జరిగిందని, అంతేకాకుండా విద్యా ఉద్యోగాల తో పాటుగా, ఓటు హక్కు, ఎన్నికల బరిలో మహిళలు పోటీచేసే హక్కులుసహితం, భారత రాజ్యాంగం ద్వారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి సమానమైన, స్వేచ్ఛ స్వతంత్రాన్ని, హక్కుల్ని కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని నానుడి, ఇది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జీవితంలో నిజం చేసిన గొప్ప ఉన్నతమైన మాత రమాయి త్యాగం, మరువలేనిధని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని తన కడుపున పుట్టిన నలుగురు బిడ్డలు చనిపోయిన ఆమె చెల్లించకుండా ఎంతో ధైర్య సాహసాలతో అంబేద్కర్ ఉన్నత చదువుల కొరకు పైసా పైసా కూడబెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత విద్యా కొరకు మాతారమాయి చేసిన త్యాగాల్ని జాతి అధ్యక్షులు తాళ్లపల్లి రవి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి లక్ష్మణ్ మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ ఏకతాటిపైకి వచ్చి, బహుజన రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలని, అంబేద్కర్ ఆశయాన్ని ఆయన కన్న కలలను సహకారం చేయవలసిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. అంతేకాకుండా మనువాదులు, పెట్టుబడిదారీ వ్యవస్థ, దళితులలో ఉన్న ఐక్యతను చీల్చడానికి పలు రకాల ఎత్తుగడలు వేస్తూ, బహుజన రాజ్యాధికారానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు దేశవ్యాప్తంగా కుట్టలు జరుగుతున్నాయని, నిరడి లక్ష్మణ్ మండిపడ్డారు. భారత రాజ్యాంగం ద్వారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల వివక్ష నిర్మూలన కొరకు కృషి చేశారని, అంతటితో ఆగకుండా అంబేద్కర్ గారు సమాజంలో స్వేచ్ఛ, స్వతంత్రాలతో, అందరూ సమానంగా జీవించేందుకు, రాజ్యాంగబద్ధంగా ఎన్నో హక్కుల్ని, అధికారాలను మనకు బాబాసాహెబ్ కట్టబెట్టారని ఆయన అన్నారు. భవిష్యత్తులో కలిసివచ్చే ఏ పార్టీతోనైనా పొత్తు ఉండవచ్చునని, రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి అవసరమైతే సొంతంగా 33 జిల్లాల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను బరిలో ఉంచి, గెలిపించుకుంటామని నీరడి లక్ష్మణ్ దిమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమాయి అమ్మగారి త్యాగాన్ని నేటి కాలంలోని స్త్రీలందరూ, స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఆదర్శవంతంగా జీవించాలని ఆయన బహుజనులకు పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ కొందరు కావాలని మాలలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వారి పద్ధతి మార్చుకోవాలని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలను అందించి ఉండకపోతే కనీసం ఈరోజు వాళ్ళు ఈ స్థాయిలో బ్రతికే వారే కాదని ఒక వర్గాన్ని ఉద్దేశించి విజయ్ ఫైర్ అయ్యారు. సమాజంలో స్త్రీ పురుషులకు అన్ని వర్గాలకు సమానమైన అధికారాలను హక్కుల్ని కల్పించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో అంబేద్కర్, రమాయి ల పై సింగర్ గోదావరి పాటలు పాడి అందరిని అలరింపజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News