నేటిసాక్షి, బ్యూరో నిజామాబాద్ టి.ఎన్ రమేష్ :
నిజామాబాద్ నగరంలోనీ సుభాష్ నగర్ లో జాతీయ మాల మహానాడు జిల్లా కార్యాలయాన్ని జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిరడి లక్ష్మణ్అధ్యక్షతన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం నడిబొడ్డున సుభాష్ నగర్లో జిల్లా కార్యాలయాన్ని ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సతీమణి, మాతా రమాయి గారి, జన్మదినం రోజున జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం ఆనందదాయకంగా ఉందని జాతీయ అధ్యక్షులు అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడీ లక్ష్మణ్ మాట్లాడుతూ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలు ఎల్లవేళలా ఏ సమస్య ఉన్న కార్యాలయంలో తనను సంప్రదించవచ్చని బహుజన వర్గాల కోసం నిరంతరం తన వంతు కృషి చేస్తానని లక్ష్మణ్ అన్నారు. జిల్లా అధ్యక్షులు విజయ్ మాట్లాడుతూ ఎల్లవేళలా ప్రజలకు జాతీయ మాల మహానాడు నాయకుల మంత్రం అందుబాటులో ఉంటామని ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుంటామని విజయ్ అన్నారు. ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ జిల్లా అధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ సోదర భావంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఐక్యమత్యంతో బహుజన రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.





