Wednesday, March 18, 2026

గీతకార్మికులకు వైద్య శిబిరం… 150 మందికి వైద్య పరీక్షలు

నేటిసాక్షి, రాయికల్ :
రాయికల్ గౌడ సంఘ భవనంలో కరీంనగర్కు చెందిన మెడికొవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం గీతకార్మికులకు వైద్య శిబిరం నిర్వహించారు. ఆస్పత్రి వైద్యులు డాక్టర్ విష్ణు ఆధ్వర్యంలో 150 మంది గీత కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పలువురు వివిధ రకాల ఆనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటాన్ని శిబిరంలో గ్రహించి వైద్య సేవలు అందజేసారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు ఎనగందుల శ్రీనివాస్, ఉపాద్యక్షులు పొన్నం శ్రీకాంత్, కోశాధికారి బండి ప్రవీణ్, పొన్నం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News