కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాచాల రస్మిక రెడ్డి…!!!

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి :
శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం ప్రభుత్వ బిసి బాలుర కళాశాల వసతి గృహం మరియు ఎ & బి వసతి గృహాలలో విద్యార్థులకు మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె వాతావరణం మార్పుల వలన కొన్ని సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాలని భోజనానికి ముందు భోజనం తర్వాత చేతులు సభ్యుతో కడుక్కోవాలని చెప్పారు వసతి గృహ ఆవరణ పరిసర ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెంద కుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు విద్యార్థులకు జ్వరం సంబంధిత లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తే మెరుగైన చికిత్స అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు ఎస్. ఆంజనేయులు, నరేందర్ రెడ్డి, వసతి గృహ సిబ్బంది వైద్య సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





